శానిటైజర్ వాడుతున్నారా…? ప్రాణాలకే ప్రమాదం…!

-

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ… ఇప్పుడు శానిటైజర్ ని వాడాలని ఎప్పటికప్పుడు వాటితో చేతులను శుభ్రం చేసుకోవాలని అందరూ సూచిస్తున్నారు. సబ్బుతో లేదా శానిటైజర్ తో చేతులు కడుక్కుంటే మన చేతిలో కరోనా వైరస్ ఉండే అవకాశం లేదని చెప్తున్నారు అందరూ కూడా. వైద్యులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. దీనితో ప్రభుత్వాలు కూడా వాటిని ఉచితంగా అందిస్తున్నాయి.

అయితే శానిటైజర్ ని వాడుకునే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి అని సూచిస్తున్నారు. ఒక వ్యక్తి తన ఇంటి వంటగదిలో నిలబడి తన మొబైల్ స్క్రీన్‌ను శానిటైజర్‌తో క్లీన్ చేస్తుండగా అతని భార్య పక్కన వంట చేస్తుంది. వెంటనే ఆ మంట వ్యాపించింది. దీనితో సదరు వ్యక్తి దాదాపు 40 శాతం వరకు కాలిపోయాడు. అతనికి ప్రాణాపాయం లేకపోయినా చేతులు మాత్రం బాగా కాలాయి.

కాబట్టి వీటి వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అని సూచిస్తున్నారు. అతడ్ని స్థానికులు గమనించి వెంటనే గంగారాం ఆస్పత్రికి తరలించారు. మొబైల్‌ను శుభ్రపరిచేటప్పుడు శానిటైజర్ ఆ మనిషి చొక్కాపై పడిందని వైద్యులు తెలిపారు. ఆ శానిటైజర్‌లో ఆల్కహాల్ వాయువు ఉంటుందని అందుకే మంటలు వ్యాపించాయి అని వైద్యులు తెలిపారు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది అని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news