సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. కాగా, వచ్చే ఏడాది మే 13వరకు ఆయన సర్వోన్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్‌గా కొనసాగనున్నారు.
ఇంతకుముందు సీజేఐగా ఉన్న డీవై చంద్రచూడ్ పదవీకాలం నవంబర్ 8న ముగిసిన విషయం తెలిసిందే. అంతకుముందే తదుపరి సీజేఐగా సంజీవ్ ఖన్నా పేరును కొలిజీయం సిఫార్సుల మేరకు కేంద్రానికి చంద్రచూడ్ సూచించారు. గత శుక్రవారం ఆయన పదవీ విరమణ చేయడంతో నేడు (సోమవారం) నూతన సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణం చేశారు.