Sankranti upcoming movies 2021: ఆ పండ‌గ‌కు సినిమాల దండయాత్ర!.. టాప్ హీరోల కూడా తిప్ప‌లు తప్పేలా లేదు!

-

Sankranti upcoming movies 2021: క‌రోనా.. సినీజగత్తుపై విపత్తులా విరుచుకుపడింది. ప‌రిశ్ర‌మ‌లోని లక్షలాది మంది జీవితాలను అల్లాక‌ల్లోలం చేసింది. కానీ, ఇప్పుడిప్పుడే.. క‌రోనా విజృంజ‌న తగ్గింది. దీంతో మ‌రో ప‌రిశ్ర‌మల్లో ఆశ‌లు చిగురిస్తున్నాయి. విడుద‌ల కాకుండా నిలిచిపోయినా.. సినిమాల‌ను రిలీజ్ సిద్ద‌మ‌య్యాయి. అయితే.. సినిమాల విడుద‌ల‌కు పండగలే సరైన స‌మ‌యంగా భావిస్తున్నారంట మూవీ మేక‌ర్స్‌. దసరా, దీపావళి, క్రిస్ మస్, సంక్రాంతి పండుల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సందడి చేయాల‌ని భావిస్తున్న‌రంట‌. ఇప్ప‌టికే కొంద‌రూ నిర్మాత‌లు, స్టార్ హీరోలు, ద‌ర్శ‌కులు పండగ బరిలో దిగడానికి సిద్ద‌మ‌య్యారు. రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేసేశారు.

కానీ, బడా హీరోలు, బడా డైరెక్ట‌ర్ మాత్రం సంక్రాంతే స‌రైన స‌మ‌య‌మ‌ని, సంక్రాంతి బ‌రిలో దిగాడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తగ్గేదే లేదంటున్నట్లుగా సంక్రాంతికి 5 సినిమాల నిర్మాత‌లు రిలీజ్ కు సిద్ద‌మయ్యారు. దీంతో ఈ పండుగ సినిమాలకు పెద్ద సీజన్ అయ్యేట్లుంది.. ఈ టఫ్ పోటీని చూస్తే.. ధియేటర్లో సినిమాల దండయాత్ర జ‌రిగేలా ఉంద‌ని పిలిస్తుంది.

ఇప్పటి వరకూ ఫిక్స్ అయిన డేట్స్ ప్రకారం.. సంక్రాంతి బ‌రిలో ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముందున్నారు. భీమ్లానాయక్ తో రంగంలోకి దిగుతుంటే.. సర్కారు వారి పాటతో మహేష్ బాబు, అలాగే.. ఫన్, ఫ్రస్టేషన్ ఏఫ్‌3తో విక్ట‌రీ వెంకటేష్, రాధేశ్యామ్ స్టోరీతో ప్రభాస్ రిలీజ్ బరిలోకి దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా భీమ్లానాయక్ సినిమాతో జనవరి 12న సంక్రాంతి సందడిని పెంచడానికే ఫిక్స్ అయ్యారు. జ‌న‌వ‌రి 13న మహేష్ బాబు సర్కారు వారి పాటతో ముందుకు వ‌స్తున్నారు.

ఇలా వ‌రుస సినిమా రిలీజ్ తో మ‌న సినిమాలకే ధియేటర్లు సరిపోవ‌డంతో ఎక్క‌డ ? ఎలా రిలీజ్ చేయాలో తెలీక స్టార్లు, ప్రొడ్యూసర్లు సతమతున్నారు. మ‌రోవైపు ఇదే స‌రైన స‌మ‌యమ‌ని తమిళ్ స్టార్ హీరో అజిత్ కూడా సంక్రాంతి బరిలో దిగనున్న‌ట్టు తెలుస్తుంది. అజిత్ హీరోగా, కార్తికేయ విలన్ గా తెరకెక్కుతున్న వలిమై చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చెయ్యబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఆ చిత్రం యూనిట్. ఇలా ఫెస్టివ‌ల్స్‌కు సినిమాల‌న్నీ సంద‌డి చేయ‌డానికి రెడీ కావ‌డంతో.. ధియేటర్లలో స్టార్ల‌ వార్ చేసుకునేలా ఉన్నారు. క‌లెక్ష‌న్ల‌తో రికార్డు క్రియేట్ చేసి బాక్సాఫీసును షేక్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version