కార్తీకదీపం సెప్టెంబర్ 25 ఎపిసోడ్-1154: పిల్లల ప్రవర్తనతో బాధడుతున్న కార్తీక్..వారణాసి మాటలకు వంటలక్క ఆవేదన

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో హిమ, శౌర్య బాధపడుతూ ఉండగా..కార్తీక్ వస్తాడు. రండి కారు ఎక్కండి అంటాడు, శౌర్య కోపంగా కార్తీక్ వైపు చూస్తుంది. ఇద్దురు వెనుక సీట్ లోనే కుర్చుంటారు. కార్తీక్ వాళ్లను చూస్తూ..నేను మూడ్ ఆఫ్ లో ఉంటే వీళ్లు ఫీల్ అవుతున్నారు అనుకుని, ఏమైంది అలా ఉన్నారు, స్కూల్లో విశేషాలు ఏంటి అని అడుగుతాడు. కానీ పిల్లలు ఏం చెప్పారు. స్కూల్ నుంచి కారుఎక్కగానే బోలడెన్ని ప్రశ్నలు ఏస్తారు అనుకున్నాను, మీరేంటి నాకేం అర్థంకారు అని హిమా మాట్లాడమ్మా , ఏమైంది, వెళ్లేప్పుడు బానే ఉన్నారుగా ఇప్పుడు ఏంటి మౌనవ్రతాలు, అలిగారా అని కార్తీక్ అడుగుతాడు. ఎంత మాట్లాడిన పిల్లలు ఏం చెప్పరు. ఐస్ క్రీమ్ కావాలా అన్నా వద్దంటారు. కార్తీక్ అలా ప్రశ్నలు వేస్తూ ఉంటే.. శౌర్య సీరియస్ గా ఇంటికి వెళ్దామా నాన్న అంటుంది.

ఇంట్లో సౌందర్య..మోనిత గురించి ఆలోచిస్తూ ఉంటుంది. జైలుకి వెళ్తూ..మోనిత అన్న మాటలను తలుచుకుని, కార్తీక్ మనసులో ఈ పీడతాలుకూ ఆలోచనలు ఎంత బాధిస్తున్నాయో, ఇద్దరి మనసులో ఆ రాక్షసి ఆలోచనలు పోవాలి అనుకుంటూ ఉండగా దీప వస్తుంది. వెళ్లేప్పుడు ఆనందంగా వెళ్లింది ఇప్పుడేంటి ఇలా వస్తుంది అనుకుని షాపింగ్ అయిపోయిందా అని అడుగుతుంది. దీప..దిగాలుగా షాపింగ్ కూడా జీవితంలాంటిదే అత్తయ్య, అయిపోయినట్లే ఉంటుంది, కానీ అయిపోదు అంటుంది. సౌందర్య దీపను పిలిచి పక్కన కుర్చోపెట్టుకుని ఏంటో కొత్తకాపురం మొదలుపెట్టినట్లు ఇంట్లోకి కొత్త వస్తువులు కొన్నావా అని అడుగుతుంది. దీప వస్తువులు కొత్తవి వచ్చినంత మాత్రానా పాత పాతపడుతుందా అత్తయ్య అని అడుగుతుంది. సౌందర్య ఆ మాటకు అన్నింటిని మర్చిపోయి..జీవితం కొత్తగా మొదలుపెట్టాలి అంటుంది. దీప ఏడుస్తూ..అంతా అయిపోయిందని మనం మాత్రమే అనుకున్నాం..కానీ బయటవేరేలా ఉంది అత్తయ్య అంటుంది. సౌందర్య ఏంటే ఎ‌వరేమైనా అన్నారా ఏమైనా అన్నారా అని అడుగుతుంది. దీప బాధగా మోనిత వల్ల కార్తీక్ పడ్డ బాధను చెప్తూ..మనసేం బాలేదు అత్తయ్య వ్రతం చేసుకుందాం అనుకుంటాను అంటుంది. సరే చేసుకుందువుకానిలే..అసలు ఏమైందో చెప్పు అంటుంది సౌందర్య.

దీప వారణాసి చెప్పిన మాటలను చెప్తుంది. సౌందర్య లేవ్వే ముందు అని ఇద్దరు లేచి నుల్చుంటారు. కన్నీల్లు తుడిచే..ఏంటేయ్ ఇది, నువ్వు అసలు దీపవేనా, ఎవడో ఏదో అన్నాడని నువ్వు ఏడుస్తూ ఇంటికొస్తావా అంటూ..దీపకు మనోధైర్యం నింపుతుంది. తనలో దాగివున్న బలాన్ని గుర్తుచేస్తుంది. మోము బాధపడితే మాకు ధైర్యం చెప్పాలిగాని పిరికిదానిలా ఇలా ఉంటావ్ అని, మనోనిబ్బరం కలిగించే మాటలు చెప్తుంది.

ఆరోజు రాత్రి హిమ.. స్కూల్లో షైని అన్న మాటలను గుర్తుచేసుకుని ఏం జరిగిందో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏది అబద్ధం, ఏది నిజమం అర్థంకావటంలేదు అని బాధపడుతుంది. ఇంకోవైపు సౌందర్య బంతిపూలు దండచేస్తూ ఉంటుంది. కార్తీక్ వచ్చి ఏంటి మమ్మీ ఇన్నిపూలు ఎందుకు అని అడుగుతాడు. సౌందర్య , దీప వ్రతం చేసుకుంటుంది అని చెప్తుంది. వ్రతమా ఎందుకు అని అడుగుతాడు కార్తీక్, అన్నీ చక్కపడ్డాయ్ కదారా అందుకే అంటుంది. కార్తీక్ ఆ మాటకు దిగాలుగా ఏం చక్కపడ్డాయ్ అని తన దీనస్థితి గురించి చెప్తాడు.అందరూ నా పరిస్థితిని చూసి ఏమనుకున్నా ఫీల్ అవలేదు, కానీ ఇంట్లో పిల్లలే అంటూ ఆపుతాడు. సౌందర్య ఏమైందిరా, పొద్దున వెళ్లేప్పుడు సంతోషంగా ఉన్నారుగా ఏమైంది అని అడుగుతుంది. కార్తీక్ కారులో జరిగిన సీన్ గురించి చెప్తాడు. మమ్మీ నేను ఏ తప్పుచేయలేదు కానీ దోషిగా అందరిముందు నిలబడ్డాను అంటూ పాపం కార్తీక్ బాధపడతాడు. ఈ సీన్ లో ఓ తండ్రి బాధ కనపిస్తుంది.

వెళ్లేప్పుడు బానే మాట్లాడుకున్నాం, కానీ వచ్చేప్పుడు ఏమైందో తెలియదు, నా పక్కన కుర్చోమన్న కుర్చోలేదు, హిమ అయితే కన్నీళ్లు పెట్టుకుంది, అడిగితే చెప్పలేదు అని బాధపడతాడు. ఇంతలో శౌర్య వస్తుంది. కార్తీక్ ని చూసి వెళ్లిపోబోతుంది. సౌందర్య ఏ రౌడి ఇలా రావే అంటుంది. శౌర్య.. హిమ పిలవకపోయినా..ఆ హిమా అని చెప్పి , హిమ పిలుస్తుంది అని వెళ్లిపోతుంది. కార్తీక్ చూశావ మమ్మీ అంటాడు. సౌందర్య పిల్లలది ఏముంది చెప్పు, ఏదో విషయంలో నీ మీద అలిగినట్లు ఉన్నారు, గంటకో రెండు గంటలకో మాట్లాడాతారు, అన్నీ పీడలు తొలిగిపోయాయ్ ప్రశాంతంగా ఉండునాన్న అంటుంది. కార్తీక్ నాకేం తేడా కనిపించటం లేదు అంటాడు. సౌందర్య ఇంతకుముందు దీప ఇలానే వస్తే సర్థిచెప్పాను అని చెప్పి కార్తీక్ కు ధైర్యం చెప్తుంది.

సౌందర్య మనసులో పిల్లల్లో సడన్ గా ఈ మార్పు ఏంటి, ఏమైందో నేను అడిగి తెలుసుకోవాలి అనుకుంటుంది. దీప కూడా మేడపై వారణాసి మాటలను గుర్తుచేసుకుని బాధడుతూ ఉంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version