Manchi Rojulochaie: దీపావళికి ‘మంచి రోజులు వ‌చ్చాయి’ అంటున్న డైరెక్ట‌ర్ మారుతి

-

Manchi Rojulochaie: టాలీవుడ్ లో ల‌వ్అండ్ కామెడీ జానర్స్ లో సినిమా తీయ‌డంలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు మారుతి. ‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’ ‘ప్రేమ కథా చిత్రం’ వంటి సినిమాల‌తో
యూత్ ను అట్రాక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం మారుతి .. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న మ‌రో మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఆ మూవీనే కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి.

కామెడి ఎంటర్‌టైనర్ గా వ‌స్తున్న ఈ చిత్రంలో ‘పేపర్ బాయ్’, ‘ఏక్ మినీ కథ’ వంటి సినిమాతో మంచి సక్సెస్ అందుకొని.. హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంతోష్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా లు జంట‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండ‌గా.. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని స‌మ‌కూర్చుతున్నాడు. ఈ చిత్రాన్ని మారుతి, వి సెల్యులాయిడ్ ఎస్ కే ఎన్ ల సూపర్ హిట్ కాంబినేషన్‌లో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్‌, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారు చేశారు మూవీ మేక‌ర్స్. దీపావళి కానుక‌గా నవంబర్ 4న మంచి రోజులు వచ్చాయి విడుదల చేయ‌నున్నారు. ఈ సందర్భంగా పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్.

మారుతి మ‌రోవైపు .. గోపిచంద్‌తో కలిసి ‘పక్కా కమర్షియల్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో గోపి చంద్ స‌ర‌స‌న రాశీ ఖన్నా హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై రూపొందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news