BIGG BOSS-5 : అది మొగోన్ని పట్టుకుంటే పని అయితది అనుకునే టైప్..సిరి పై రెచ్చిపోయిన సరయు..!

-

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన సభ్యులు బిగ్ బాస్ బజ్ లో ఇంటర్వ్యూ ఇవ్వడం ఆనవాయతీ. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో కూడా ఎలిమినేట్ అయ్యి సభ్యులు బయటకు వచ్చిన సభ్యులు బిగ్ బాస్ బజ్ లో ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హౌస్ నుండి మొదటగా ఎలిమినేట్ అయ్యి వచ్చిన సరయు బిగ్ బస్ బజ్ లో అరియానా కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో సరయు ఒక్కో సభ్యుడిపై బాంబులు పెల్చేసింది. ముఖ్యంగా సిరి హన్మంతు, యాంకర్ రవి, సన్నీ, షణ్ముక్ జశ్వంత్ లపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

యాంకర్ రవి, సన్నీ, షణ్ముక్, సిరి హన్మంతు ముందుగా అనుకుని హౌస్ లోకి వచ్చారని ఆరోపించింది. వాళ్ళంతా కలిసి ప్లాన్ ప్రకారం తనను బయటకు పంపారని చెప్పింది. ఇక షణ్ముక్.. సిరి హన్మంతు ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడని చెప్పింది. మొదట వెబ్ సిరీస్ లు చూసి షణ్ముక్ హీరో అనుకున్నా అని హౌస్ లోకి వెళ్ళాక తెలిసింది అని చెప్పింది. మొగోడు అయితే సింగిల్ గా ఆడాలని కామెంట్స్ చేసింది. లేదంటే గాజులు వేసుకోవాలని…తాను గాజులు వేసుకుని హౌస్ లోకి వెళ్ళా అని షణ్ముక్ కు అవి కూడా ఇయ్య అంటూ ఫైర్ అయ్యింది. ఇక సిరి హన్మంతు ఒక్ మొగోన్ని పట్టుకుంటే పని అయితది అనుకునే టైప్ అంటూ మండి పడింది. అలాగే యాంకర్ రవి, విజే సన్ని పై కూడా సరయు సంచలన వ్యాఖ్యలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news