జగన్‌ తో సినీ పెద్దల భేటీ.. ముహుర్తం ఎప్పుడంటే !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో సినిమా టికెట్ల ను పూర్తిగా ఆన్‌లైన్‌ లోనే కొనుగోలు చేసేలా విధానాన్ని తీసుకు రావాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. అయితే… దీని పై ఆంధ్ర ప్రదేశ్‌ లోని విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు.

jagan
jagan

ఆన్ లైన్ విధానం ద్వారా సినిమా టిక్కెట్ల అమ్మకం జరపాలని సినీ ప్రముఖులే కోరారని.. సినీ పెద్దల సూచననే ప్రభుత్వం పరిశీలించిందని వివరించారు. పన్ను ఎగవేత జరుగుతోందని ప్రభుత్వం గమనించిందని… బ్లాక్ టిక్కెట్లు లేకుండా అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు.

ప్రజలకు మేలు చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. టిక్కెట్ రేట్లను, ఇష్టానుసారంగా షోలు వేయడాన్ని నియంత్రిస్తూ ఏప్రిల్ 8వ తేదీన ఇచ్చిన జీవో ఇచ్చామని స్పష్టం చేశారు. ఇక సినీ ఇండస్ట్రీ పెద్దలు సీఎం జగనుతో భేటీ అవుతామని కోరారని… ఆగస్టులో భేటీ కావాలని భావించినా కుదర్లేదని వివరించారు. త్వరలోనే సినీ పెద్దలు సీఎం జగనుతో భేటీ కానున్నారని స్పష్టం చేశారు. అయితే.. ఈ నెల 20 న సీఎం జగన్‌ తో సినీ పెద్దలు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news