‘సర్కారు వారి పాట’ మరో లుక్ విడుదల …. అబ్బా ఏమున్నాడు బాబు …. !!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశు రామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట పేరుతో సినిమా తెరెకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాపై రకరకాల ప్రచారాలు ముందు నుండీ జరుగుతూనే ఉన్నాయి.

ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు తెరకెక్కిస్తున్నాయి.  మహేష్ బాబు దుబాయ్ వెళ్లడంతో షూటింగ్ దుబాయ్ లోనే జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా మరో అప్డేట్ వచ్చింది. కాసేపటీ క్రితమే.. ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ పోస్టర్ లో మహేష్ బాబు మంచి గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నాడు. అంతే కాదు ఎరుపు కలర్ కారు నుంచి దిగుతూ మాస్ ఫ్యాన్స్ మనసులను దోచుకుంటున్నాడు మహేష్. ఇక ఈ పోస్టర్ ద్వారా సినిమాను జనవరి 13 న  విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించింది చిత్ర బృందం.