సర్కారు నౌకరి సినిమా ఓటీటీ లోకి రావడానికి రెడీ అయింది. టాలీవుడ్ సింగర్ సునీత కొడుకు ఆకాష్ గోపరాజు రీసెంట్ గా సర్కారీ నౌకరి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమా జనవరి 1న రిలీజ్ అయింది. సోషల్ మెసేజ్ కి కమర్షియల్ హంగులని తీసుకు వచ్చి సినిమాని రిలీజ్ చేశారు. ఈ సినిమాకి గంగానమోని శేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆర్కే టెలి షో పతకం పై కే రాఘవేంద్రరావు ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాతో భావన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.
ఈ సినిమాకి శాండిల్య బొబ్బిలి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఇది వరకు శేఖర్ గంగానమోని పంచతంత్ర కథలు పేరు తో సినిమా చేశారు. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి 25 రోజుల్లోనే ఓటీటీ లోకి రాబోతోంది. జనవరి 26న ఓటీటీ లోకి వస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి హక్కుల్ని సొంతం చేసుకుంది. త్వరలోనే ఓటిటి రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు.