సర్వదర్శనం రెండు, మూడు గంటల్లోనే.. టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు ఇవే..!

-

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి తొలి సమావేశం ఇవాళ తిరుమలలో జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేస్తూ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. శారద పీఠానికి కేటాయించిన భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. శారద పీఠం లీజు రద్దు చేసింది. దేవస్థానంలో అతిథి గృహాలకు సొంత పేర్లు పెట్టకూడదని నిర్ణయించింది. 

TTD

రెండు,మూడు గంట్లోనే సర్వదర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ లో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులు ప్రభుత్వానికి అప్పగించాలని బోర్డు నిర్ణయించింది. తిరుపతి శ్రీనివాస సేతు ప్లై ఓవర్ కు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించినట్టు చైర్మన్ బీ.ఆర్. నాయుడు తెలిపారు. పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తి రద్దు చేస్తున్నట్టు తెలిపారు. తిరుపతి ప్రజలకు ప్రతినెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. అన్న ప్రసాదంలో మరో భక్తులకు వడ్డించాలని నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news