బ్రేకింగ్‌: ఏపీ శాస‌న‌స‌భ స‌మావేశాలు ఎప్పుడంటే..!

-

ఏపీ శాస‌న‌స‌భ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వం స‌మాయత్త‌మ‌వుతోంది. రెండ్రోజుల్లో అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఖరారు చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో కీలకమైన ఇసుక విధానంతో పాటు ఇతర బిల్లులను సర్కారు ప్రవేశపెట్టనుంది. జూన్‌లో వర్షాకాల సమావేశాలను నిర్వహించిన ప్రభుత్వం… 6 నెలల్లోగా మరోమారు శాసనసభను సమావేశపరచాలి. ఈ క్ర‌మంలోనే డిసెంబరు మొదటి వారంలో సమావేశాలు నిర్వహించాలని సంకల్పించింది.

ఇక ఏపీలో ప్ర‌స్తుతం అధికార వైసీపీ, విప‌క్ష టీడీపీతో పాటు జ‌న‌సేన మ‌ధ్య రోజు బ‌య‌ట యుద్ధ వాతావ‌ర‌ణం న‌డుస్తోంది. చంద్ర‌బాబు దీక్ష‌ల‌కు దిగుతుంటే.. ప‌వ‌న్ ఇప్ప‌టికే లాంగ్ మార్చ్ అంటూ విశాఖ‌లో ఇసుక కొర‌త‌పై నానా హంగామా చేశాడు. ఎన్నిక‌ల‌కు ముగిసి ఆరు నెల‌లు కూడా కాకుండా ఏపీ రాజ‌కీయ వాతావ‌ర‌ణం ప్ర‌తి రోజు వేడెక్కుతోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే స‌మావేశాల్లో అసెంబ్లీ లోప‌ల వార్ ఎలా జ‌రుగుతుందో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news