రాజకీయాలపై శశికళ సంచలన ప్రకటన

తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి  జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే బహిష్కరణ ప్రధాన కార్యదర్శి శశికళ… తాజాగా సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను ఉద్దేశించి… ప్రకటన చేశారు శశికళ. అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు… ఎవరూ కూడా అధైర్యపడొద్దు అని భరోసా కల్పించారు శశికళ.

అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలను తన నుంచి ఎవరూ కూడా దూరం చేయలేరు అని… ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలకు చురకలు అంటించారు శశికళ. తన తుది శ్వాస ఉన్నంత వరకు అన్నాడీఎంకే పార్టీని కాపాడుకుంటాం అని స్పష్టం చేశారు. అన్ని సంక్షోభాలు త్వరలోనే తొలగిపోతాయని శశికళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే పార్టీ కి త్వరలోనే పూర్వవైభవం రాబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు శశికళ. ఇక శశికళ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆమె మళ్లీ రాజకీయా ల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారా ? అనే సందేహం అందరిలోనూ మొదలైంది.