నాలుక చీరేస్తాం..టిఆర్ఎస్ నేతకు ఉదయభాను వార్నింగ్ !

ఖమ్మం జిల్లా మధిర మున్సిపల్ టిఆర్ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు.. కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దూమరాన్ని రేపుతున్నాయి.తాజాగా టిఆర్ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని
ఉదయభాను. కొడాలి నాని, వంశీ, అంబటి రాంబాబుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు.

చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను సభలో ప్రస్తావించలేదన్నారు. సానుభూతి కోసమే చంద్రబాబు చేతులు అడ్డం పెట్టుకుని ఏడ్చాడని.. సానుభూతి కోసం చంద్రబాబు ఏడ్వటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యాఖ్యమ చేశారు. కులపరమైన కార్యక్రమాల్లో వారి కష్ట నష్టాలు చెప్పుకోవాలి కాని.. రాజకీయ వ్యాఖ్యలు చేయటం కరెక్టు కాదన్నారు. పార్టీలు మారే మల్లాది వాసు మా పార్టీ నాయకులను అంతం చేస్తానని అనడం నీ డబ్బు అహంకారం అని, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నిన్ను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడు అని ఆయన మల్లాది వాసును హెచ్చరించారు సామినేని ఉదయభాను.