గత ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీలో తారక మంత్రం ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కు అప్పగించాలని ప్రచారం హోరెత్తెత్తున్న విషయం తెలిసిందే. టీడీపీ భారీ ఓటమి, చంద్రబాబుకు వయసు మీద పడటం, లోకేష్‌కు పార్టీని నడిపించే సామర్థ్యం లేకపోవడంతో…జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వచ్చి పార్టీ పగ్గాలు చేపట్టాలని…ఎన్టీఆర్ అభిమానులే కాదు…టీడీపీలో కొంతమంది కార్యకర్తలు కోరుకుంటున్నారు. అలాగే ప్రత్యర్ధి పార్టీలో ఉన్న వాళ్ళు కూడా టీడీపీ నిలబడాలంటే ఎన్టీఆర్ రావాల్సిందే అని అంటున్నారు.
అయితే చంద్రబాబుకు ఇంకా వయసు ఉంది…ఆయన ఉన్నంతకాలం టీడీపీ పగ్గాలు ఎవరు చేతుల్లోకి వెళ్లవని, ఆయనే పార్టీని ముందుకు తీసుకెళ్తారని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ నేతలు చెప్పిన మాట నిజమే అని చెప్పాలి…చంద్రబాబు స్టామినా తగ్గలేదు..ఆయనకు పార్టీని నడిపించే సత్తా ఉంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి పార్టీని చాలావరకు బయటపడేయడానికి చూస్తున్నారు.
ఈ రెండున్నర ఏళ్లలో వైసీపీని తట్టుకుని పార్టీని నిలబెట్టారంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో ఎన్టీఆర్ అవసరం అంతగా రాకపోవచ్చు..కానీ ఫ్యూచర్‌లో మాత్రం ఎన్టీఆర్ అవసరం ఉందని, ఎందుకంటే జనాలని ఆకర్షించే శక్తి తారక్‌కు ఉందని, అలాగే టీడీపీకి దూరంగా ఉన్న యువ ఓటర్లని ఆకర్షించగలరని, ఎన్టీఆర్‌కు జనంలో కలిసిపోయే సత్తా ఉందని, ఎన్టీఆర్‌కు మాస్ పల్స్ తెలుసని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇప్పుడు కాకపోయిన ఓ పదేళ్ళ తర్వాత మాత్రం పార్టీకి ఎన్టీఆర్ అవసరం చాలా ఉందని అంటున్నారు. ఇక ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే…ఒకవేళ 2024 ఎన్నికల్లో గానీ టీడీపీ గెలిస్తే ఇబ్బంది లేదు…ఓడిపోతే మాత్రం అప్పుడు ఎన్టీఆర్ పేరు ఇంకా హోరు ఎత్తుతుందని, అప్పుడు ఎలాంటి పరిణామలైన జరగొచ్చని అంటున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ మాత్రం టీడీపీలోకి రావడం మాత్రం పక్కా అని చెబుతున్నారు.