ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయం ఓ లెక్కలో సాగుతోంది సిద్ధమని వైసిపి కాంపైనింగ్ చేస్తుంటే, ప్రతిపక్షాలు కౌంటర్లు వేస్తున్నాయి. తాజాగా సీఎం జగన్ పై బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ సెటైర్ వేశారు. సిద్ధమని ఉత్తర కుమార్ ప్రగల్పాలు పలికి ఇప్పుడు మీరే యుద్ధం చేయాలని వాలంటీర్లు ని పురిగొల్పడం ద్వారా సీఎం వైయస్ జగన్ చేతులెత్తేసారని సత్యకుమార్ యాదవ్ విమర్శించారు.
వాలంటీర్లు యుద్ధం చేస్తే మీరు పబ్జి ఆడుకుంటారా అని అడిగారు చదువుకున్న యువతకి ఉద్యోగాలు ఇవ్వకుండా వాలంటీర్ల పేరుతో ముష్టి ఐదు వేలు విధులు ఎంతో విలువైన వాళ్ళ ఐదేళ్ల కాలనీ వృధా చేశారని ఫైర్ అయ్యారు. చాకిరి చేస్తూ అవమానాలకు గురి చేస్తున్నారని ప్రజల్లో చులకన చేసిన వారి భవిష్యత్తు నాశనం చేశారని అందువలన అవినీతి అరాచక వైసిపి పార్టీని కోకటి వేళల్లో పెకలించే నిశ్శబ్ద తుఫానులో వాలంటీర్లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.