ఆంధ్రప్రదేశ్ పల్నాడు లోని సత్తెనపల్లి శివారు ప్రాంతంలో గత 10 రోజులుగా అక్కడి ప్రజలు రంగు రాళ్లు మరియు వజ్రాల కోసం వెతుకుతున్నారు. ఈ విషయం చిన్నగా అటు పాకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు సైతం సత్తెనపల్లికి పెద్ద సంఖ్యలో చేరుకొని వజ్రాల కోసం చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ ఇదే పనిమీద వేటను మొదలు పెట్టారు. ఇక ఈ విషయం తెలిసిన స్థానిక బంగారు షాపుకు చెందిన యజమానులు వజ్రాల టెస్టర్ లు మరియు స్కానర్ ల పేరుతో హడావిడి చేస్తున్నారు. కొల్లూరు ప్రాంతంలో అడవి మట్టి తీసుకుని సత్తెనపల్లి శివారు ప్రాంతంలో వేయడంతో వజ్రాలు ఉంటాయని ఊహించి వాటి కోసం వెతుకుతున్నారు. అయితే వజ్రాలు దొరికాయో లేదా తెలుసుకోకుండానే కొందరికి దొరికాయి అంటూ పుకార్లను సైతం పుట్టించారు. ఈ దెబ్బతో చుట్టుపక్కల ప్రజలు రోజు వారీ పనులకు కూడా వెళ్లడం మానేసి వజ్రాలు దొరుకుతాయన్న ఆశతో అదే పనిలో ఉన్నారు.
మరి చివరికి ఎవరికైనా వజ్రాలు దొరుకుతాయా ? అసలు అక్కడ వజ్రాలు ఉన్నాయా ? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే కొంచెం సమయం వేచి చూడాల్సిందే.