సీఎం కేసీఆర్‌ వదిలిన బాణం బడే నాగ జ్యోతి : సత్యవతి రాథోడ్‌

-

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆయా పార్టీల నేతలను గెలిపించుకునేందుకు పార్టీ సీనియర్‌ నేతలు రంగంలోకి దిగారు. అయితే.. సీఎం కేసీఆర్‌ వదిలిన బాణం బడే నాగ జ్యోతి అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతి నామినేషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లా డారు. సీఎం కేసీఆర్‌ ములుగును జిల్లాగా ఏర్పాటు చేసి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించారు. మేము ఢిల్లీ నుంచి రాలేదు ఇక్కడి నుంచి వచ్చిన బిడ్డలమే. నోటుకు, ఓటు కేసులో జైలుకు పోయి నీతులు వల్లించడం రేవంత్ రెడ్డికే చెల్లుతుందన్నారు. గిరిజన సంక్షేమమే కేసీఆర్‌ ధ్యేయం.

BRS MLA Candidate Bade Nagajyothi Files Nomination

తండాలను, గూడాలను గ్రామపంచాయతీలుగా చేసుకున్నాం. 10 శాతం గిరిజన రిజర్వేషన్ పెంచుకున్నాం. పోడు భూములకు పట్టాలు అందించాం. మారుమూల ప్రాంతాల్లో సైతం బీటీ రోడ్లు వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏం అభివృద్ధి చేసిందో చర్చకు వచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ములుగు జిల్లా పై గులాబీ జెండా ఎగరేసి కేసీఆర్‌కు కానుకనిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి, రాష్ట్ర రహదారుల భవనాల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీను, మండలాల ఇన్‌చార్జి సమ్మారావు, గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, ములుగు ఎంపీపీ శ్రీదేవి, వాణిశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news