దేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ). ఈ బ్యాంకు ఖాతాదారుల సంఖ్య ఎక్కువే. అదే సమయంలో ఈ బ్యాంకు కస్టమర్లు డెబిట్ కార్టులను వినియోగిస్తున్నారు. అయితే వారందరికీ షాకింగ్ న్యూస్… బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి డెబిట్ కార్డులను ఎత్తివేయనున్నారు. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించే నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్(ఎస్‌బీఐ) కార్డులను పూర్తిగా రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. తాము డెబిట్ కార్డులను సంపూర్ణంగా తొలగించాలని భావిస్తున్నట్లు ఆ బ్యాంక్ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. దేశంలో 90 కోట్ల డెబిట్ కార్డులున్నాయి.
మరో 3 కోట్ల క్రెడిట్ కార్డులన్నాయన్నారు. యోనో యాప్‌తో డెబిట్ కార్డులకు స్వస్తి పలకాలని ఎస్‌బీఐ భావిస్తున్నది. యోనో ప్లాట్‌ఫామ్‌తో ఏటీఎం వద్ద క్యాష్‌ను డ్రా చేసుకునే సౌకర్యం కల్పించనున్నారు. ఏదైనా షాపు వద్ద కొనుగోలు చేయాలంటే కూడా యోనో ప్లాట్‌ఫామ్‌ను వాడే వీలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా 68వేల యోనో క్యాష్ పాయింట్లు ఉన్నట్లు ఆయన చెప్పారు.
– కేశవ