నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌: ఎస్‌బీఐలో 7870 క్లర్క్ జాబ్స్.. వివ‌రాలు..

-

కొత్త సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బి‌ఐ) బ్యాంక్ ఉద్యోగాలకోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఏకంగా 7870 క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. హైదరాబాద్ రీజియన్‌లో 375 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2020 జనవరి 26 చివరి తేదీ. డిగ్రీ పాసైన అభ్యర్థులు క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఇస్తోంది ఎస్‌బీఐ. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. దరఖాస్తు చేసేముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

2020 జనవరి 1 నాటికి మీకు పూర్తి అర్హతలు ఉండాలి. ఇక ఎస్‌బీఐలో జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలన్న సందేహాలు అభ్యర్థుల్లో ఉన్నాయి. దీని కోసం ముందుగా అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత https://sbi.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి. అందులో ‘Latest Announcements’ ట్యాబ్ క్లిక్ చేస్తే ‘Recruitment of Junior Associates’ లింక్ కనిపిస్తుంది. అందులో ‘Apply Online’ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. కొత్త పేజీలో ‘Click Here for New Registration’ పైన క్లిక్ చేయాలి.

ఇప్పుడు మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలతో రిజిస్టర్ చేయాలి. మీకు ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ జనరేట్ అవుతాయి. వాటిని గుర్తుంచుకోవాలి. మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్‌కు ఈ వివరాలు వస్తాయి. ఆ తర్వాత స్టెప్‌లో మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ ఫోటో, సంతకం, ఎడమచేతి బొటన వేలిముద్ర, డిక్లరేషన్ అప్‌లోడ్ చేయాలి. మ‌రియు అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేయాలి. ఇక చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేస్తే స‌రిపోతుంది. ఇక మీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. ఇకెందుకు ఆల‌స్యం వెంట‌నే అప్లై చేయండిలా..!

Read more RELATED
Recommended to you

Latest news