ఈ బ్యాంక్ ఖాతాదారులుకి రూ.10 వేల భారీ తగ్గింపు..!

-

మీకు స్టేట్ బ్యాంక్ లో ఖాతా వుందా..? అయితే మీకు గుడ్ న్యూస్. దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIకు చెందిన అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డు తన కస్టమర్లకు తీపికబురు అందించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలని చూస్తే.. అదిరిపోయే ఆఫర్లుని SBIకు చెందిన అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డు తీసుకు రావడం జరిగింది. అయితే పండుగ సీజన్ నేపథ్యంలో భారీ తగ్గింపు అందిస్తోంది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్.

SBI

ఇది ఇలా ఉంటే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ని ఉఉపయోగించడం ద్వారా షాపింగ్ చేసే వారికి ఏకంగా రూ.10 వేల వరకు క్యాష్‌ బ్యాక్‌ వస్తుంది. మీరు కనుక ఈ ఆఫర్ ని పొందాలంటే అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 5 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే 10 శాతం క్యాష్‌ బ్యాక్ పొందొచ్చు.

అయితే ఒక్కో కార్డుపై గరిష్టంగా రూ.10 వేల వరకు క్యాష్‌ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. మీరు కనుక
కనీసం కార్డు ద్వారా రూ.7500 ఖర్చు చేస్తే రూ.1750 క్యాష్‌ బ్యాక్ పొందొచ్చు. అదే మీరు కనుక
కార్డు ద్వారా రూ.లక్ష కొనుగోలు చేస్తే.. రూ.10 వేల వరకు క్యాష్‌ బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ ని దిగ్గజ ఈకామర్స్ సైట్లలో మొబైల్స్, కన్సూమర్ డ్యూరబుల్స్, ల్యాప్‌టాప్స్, కిచెన్ అప్లయెన్సెస్, హోమ్ డెకోర్, ఫ్యాషన్, లైఫ్‌స్టైల ఇలా ఏ ప్రొడక్టులు కొనుగోలు చేసిన ఉపయోగించచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version