“మా” ఎన్నికల పై వైసీపీ సర్కార్ సంచలన ప్రకటన

-

మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు హాట్ హాట్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి మా అసోసియేషన్ ఎన్నికలు. ఇటీవలే మా అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియగా… ప్రకాష్ రాజు మరియు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు తమ తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల తేదీ… సమీపిస్తున్న కొద్దీ… ప్రచారం జోరుగా సాగిస్తున్నారు అభ్యర్థులు. ఈ నేపథ్యం లో మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలపై వైసీపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది.

“మా” అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలతో ఎటువంటి సంబంధం లేదని ఏపీ సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి కి గానీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గానీ ఎటువంటి సంబంధం లేదు అని మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తెలిపారు. ఈ ఎన్నికలలో మేం ఏ వ్యక్తినీ, ఏ వర్గాన్నీ సమర్థించడం లేదు అని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version