డబ్బులని పొదుపు చేయాలని అనుకునే వారికి డబ్బులని పోస్ట్ ఆఫీస్ లో దాచుకోవాలా..? లేదా స్టేట్ బ్యాంక్ లో దాచుకోవాలా..? అని సందేహం కలుగుతుంది. మీకు కూడా ఈ సందేహం ఉందా..? అయితే దీని కోసం పూర్తి వివరాలు మీ కోసం. ప్రతి నెలా కొంత డబ్బు పొదుపు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు రికరింగ్ డిపాజిట్ సేవలు అనువుగా ఉంటాయి. దీని కోసం మీరు బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ఆర్డీ అకౌంట్ ఓపన్ చేయొచ్చు. ఇలా మీరు ప్రతి నెలా రూ.100 నుంచి డిపాజిట్ చేసుకోవచ్చు. SBI , పోస్టాఫీస్ రెండింటి లో కూడా మీరు రికరింగ్ డిపాజిట్ సేవలు పొందొచ్చు.
ఎస్బీఐ లో రికరింగ్ డిపాజిట్ మెచ్యూరిటీ కాలం ఏడాది నుంచి పదేళ్ల వరకు ఉంటుంది. అదే పోస్టాఫీస్ లో ఐదేళ్లకే డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. అలానే స్టేట్ బ్యాంక్‌లో ఆర్డీ తెరిస్తే కనుక మీరు నెలకు రూ.100 నుంచి ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. పోస్టాఫీస్‌లో ఆర్డీ తెరవాలని భావిస్తే రూ.10 ఉంటె చాలు. ఎస్బీఐలో రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేయడానికి చెక్ లేదా క్యాష్ ఇవ్వొచ్చు. ఇక పోస్టాఫీస్‌లో అయితే నగదు మాత్రమే ఇవ్వాలి.