రుణ గ్రహీతలకి SBI హెచ్చరిక…!

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI రుణ గ్రహీతలను హెచ్చరించింది. లోన్ తీసుకోవాలని అనుకునే వాళ్ళు తప్పక దీనిని గమనించడం మంచిది. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్స్ ని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. లేదంటే ఇబ్బందులు పడాల్సి రావొచ్చని అలర్ట్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… స్టేట్ బ్యాంక్ తమ కస్టమర్స్ ని మోసగాళ్లు రుణ గ్రహీతలను మోసం చేస్తున్నారని ఎస్‌బీఐ తెలిపింది.

ఎస్‌బీఐ లోన్ ఫైనాన్స్ లేదా ఇతర కంపెనీల పేర్లు చెప్పి రుణాలు అందిస్తామని మాయమాటలు చెబుతున్నారని ఎస్బీఐ అంది. ఫేక్ లోన్ ఆఫర్ అందిస్తూ స్కామ్ చేస్తున్నారని కస్టమర్స్ జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది.

అందువల్ల కస్టమర్లు ఇలాంటి వారి తో జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఇది ఇలా ఉండగా ఎస్‌బీఐ లోన్ ఫైనాన్స్ అంటూ ఎవరైనా కాల్ చేస్తే అప్రమత్తంగా ఉండాలని ఒకవేళ అటువంటి మోసగాళ్ల బారిన పడ్డారంటే ఎలాంటి సంబంధం లేదని ఎస్బీఐ చెప్పింది.

ట్విట్టర్ లో స్టేట్ బ్యాంక్ ఈ విషయాల్ని చెప్పింది. మనుగడలో లేనటువంటి కంపెనీల పేర్లు చెప్పి, వాటి ద్వారా రుణాలు అందిస్తామని ప్రజలను మోసం చేస్తున్నారని ఎస్‌బీఐ తెలిపింది. లోన్ కావాలంటే నేరుగా బ్యాంక్ కి వెళ్లి తీసుకోవడం మంచిది.