పొంచి ఉన్న ప్రమాదం.. వ్యాక్సిన్ వేయించుకుని కరోనా బారిన పడిన వారి సంఖ్య..!

-

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా తగిన జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు బాధితుల్లో వ్యాక్సిన్ ప్రభావం చూపకపోవడంతో మళ్లీ కరోనా బారిన పడుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా దేశంలో ఇప్పటివరకు టీకాలు వేసుకున్న వారిలో ఎంత మందికి కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని కేంద్రం స్పష్టం చేసింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ రెండు డోసుల తర్వాత 0.04 శాతం మందికి మళ్లీ కరోనా వచ్చిందని, కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న తర్వాత 0.03 శాతం మందికి మళ్లీ కరోనా వచ్చినట్లు గుర్తించారు.

VACCINE
VACCINE

కేంద్ర ఆరోగ్యశాఖ ఈ నెల 20వ తేదీన వెలువరించిన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ 11.6 మిలియన్ మోతాదుల టీకా సరఫరా చేయబడింది. 10,03,02,745 మంది మొదటి మోతాదు టీకాను తీసుకున్నారు. వీరిలో 17,145 మందికి మళ్లీ కోవిడ్ లక్షణాలు బయట పడ్డాయి. అలాగే 1,57,32,754 మంది రెండవ మోతాదు టీకా తీసుకున్నారు. వీరిలో 5,014 మంది మళ్లీ కరోనా వ్యాధి సోకింది. ఇదే సమయంలో 93,56,436 మందికి మొదటి మోతాదు టీకా అందించారు. వీరిలో 4,208 మంది కరోనా పాజిటివ్ వచ్చింది. 17,37,178 మందికి టీకా ఇవ్వడంతో వీరిలో 695 మంది కరోనా బారినపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీ చేసి భారతదేశం ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఇప్పటివరకు 19,01,413 సెషన్లలో మొత్తం 113,01,19,310 మోతాదుల వ్యాక్సిన్ పంపిణీ చేయబడింది. వీరిలో మొదటి మోతాదులో 92,01,728 వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది ఉన్నారు. రెండవ మోతాదులో 58,17,262 మంది ఆరోగ్య సిబ్బందికే వ్యాక్సిన్ అందజేశారు. అలాగే మొదటి మోతాదులో 60 ఏళ్లు పైబడిన వారు 4,73,55,942 మంది, రెండవ మోతాదులో 53,04,679 మంది ఉన్నారు. 45-60 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వారికి మొదటి మోతాదులో 4,35,25,687. రెండవ మోతాదులో 14,95,656 మంది ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news