మీరు ఎస్‌బీఐ బ్యాంక్‌లో అకౌంట్ తెరవాలనుకుంటున్నట్లయితే ఎక్కడికీ వెళ్లకుండా, ఈజీగా ఇంటి నుంచే బ్యాంక్ ఖాతా తెరవచ్చు. దీనికి కావాల్సినవి పాన్ కార్డు, ఆధార్ కార్డు. ఇక అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తన ఖాతాదారులకు ఇప్పటికే ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. అందులో భాగంగానే అకౌంట్ ఓపెనింగ్ . అది కూడా క్షణాల్లో ఎస్‌బీఐ ఖాతాదారులుగా మారడం ఎలానో చూద్దాం. ఎస్‌బీఐ ఇన్‌స్టా బ్యాంక్ ఈ అకౌంట్ సేవలు అందిస్తోంది. ఇది పేపర్ లెస్, బ్యాంక్ బ్రాంచులకు వెళ్లకుండానే అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. కేవలం నాలుగు నిమిషాల్లో బ్యాంక్ ఖాతా తెరవచ్చు. మీరు మీ వద్ద ఆధార్ కార్డు ఉంటే సులభంగా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఇన్ స్టా సేవింగ్ బ్యాంక్ ఖాతాను రోజులో ఎప్పుడైనా ఓపెన్ చేయవచ్చు. 24 గంటలూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఎస్‌బీఐ యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసే వెసులుబాటు ఉంది. ఈ పద్ధతిలో అకౌంట్ తెరిచిన వారికి రూపే ఏటీఎం డెబిట్ కార్డు ఇస్తారు. ఇలా ఖాతా ఓపెన్ చెసినవారికి బ్యాంక్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్‌టెన్ చేయాల్సిన అవసరం లేదు.
మీరు కూడా బ్యాంక్ ఖాతా తెరవాలని అనుకుంటున్నారా? అయితే.. వెంటనే మీ మొబైల్‌లో ప్లేస్టోర్ నుంచి యోనో యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ యాప్‌లో పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు ఎంటర్ చేయాలి. మీ రిజిస్ట్రర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. వెంటనే యాప్‌లో ఓటీపీ వివరాలను సబ్‌మిట్ చేయాలి. అంతే మీకు క్షణాల్లో ఖాతా క్రియేట్ అయిపోతుంది. ఏడాదిలోపు ఏదైన మీకు దగ్గర్లో ఉన్న బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి కేవైసీ పూర్తి చేసుకోవాలి. అంతే మీకు ఎస్‌బీఐ ఖాతా పూర్తిస్థాయిలో బ్యాంకు ఖాతాదారు అయిపోతుంది.