ఏపీ సర్కార్ కు షాక్.. అమరావతిపై అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు

-

ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల అంశంలో ఆ రాష్ట్ర సర్కార్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కేసు విచారణ త్వరగా చేపట్టాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది. జులై 11న తొలి కేసుగా విచారణకు తీసుకుంటామని స్పష్టం చేసింది.

హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు మరోసారి కోరగా.. స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం నిరాకరించింది. రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్‌ను వెంటనే విచారించాలన్న ఏపీ ప్రభుత్వ న్యాయవాదులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జోసెఫ్‌ అసహనం వ్యక్తం చేశారు. ఒక కేసు విచారణ పూర్తి కాకుండా.. మరో కేసు ఎలా విచారిస్తామని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం అలా విచారించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

లంచ్ బ్రేక్ తర్వాత బెంచ్‌ కూర్చొనేటప్పుడు వేరే అంశాలు, కేసులకు సంబంధించి మెన్షనింగ్స్‌ జరిగాయి. ముంబయి కేసు విచారణ తిరిగి ప్రారంభించే ముందు ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు అమరావతి పిటిషన్‌ తీసుకోవాలని కోరగా.. జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news