ముందస్తు బెయిల్‌ కోసం .. మరోసారి హైకోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి

-

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో త్వరలోనే మళ్లీ సీబీఐ విచారణకు పిలవనున్న నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే అవినాష్ రెడ్డిని పలు సార్లు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ నేతృత్వంలో అధికారులు విచారించిన విషయం తెలిసిందే.  ఇదే కేసుకు సంబంధించి గతంలోనే అవినాష్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. అరెస్టు చేయవద్దని తాము ఆదేశాలు ఇవ్వలేమని ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.

 

వివేకా హత్యకేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేసును ఇంకెంత కాలం విచారిస్తారని సీబీఐపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. హత్యకు గల ప్రధాన కారణాలు, ఉద్దేశాలు బయటపెట్టాలని పేర్కొంది. ‘విచారణాధికారిని మార్చండి లేదా ఇంకో అధికారిని నియమించండ’ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే ఇప్పుడున్న అధికారిని కొనసాగించండని పేర్కొంది. సీబీఐ డైరెక్టర్‌ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని పేర్కొన్న ధర్మాసనం.. కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ క్రమంలో సీబీఐ విచారణ వేగవంతం కానుండటంతో అవినాష్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news