రాజకీయ నేతలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయలేం : సుప్రీం కోర్టు

-

కేంద్ర దర్యాప్తు సంస్థలపై కాంగ్రెస్ సహా విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. సీబీఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, విపక్షాలను లక్ష్యంగా చేసుకుంటూ కేసులు నమోదు చేస్తోందని… ఈ నేపథ్యంలో అరెస్టు, రిమాండు, బెయిల్‌ అంశాల్లో ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్‌ సహా 14 విపక్ష పార్టీలు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం.. వాస్తవిక సందర్భం లేకుండా మార్గదర్శకాలు జారీ చేయడం ప్రమాదకరమని పేర్కొంది.

ఈ విషయంలో సాధారణ పౌరులకు వర్తించే నిబంధనలే రాజకీయ నేతలకూ వర్తిస్తాయని ప్రత్యేక మినహాయింపులేవీ ఉండవని బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘’సాధారణ పౌరుల కంటే రాజకీయ నాయకులేమీ ఎక్కువ కాదు. ఇద్దరూ సమానమని మేం అంగీకరించిన తర్వాత.. మూడు రకాల అంశాలపై సంతృప్తి పొందితే తప్ప అరెస్టు చేయకూడదని మేమెలా ఆదేశాలు జారీ చేస్తాం. అయినా ఇక్కడ ప్రత్యేకంగా ఏ కేసును పేర్కొనలేదు. అలాంటప్పుడు మార్గదర్శకాలు జారీచేయడం ప్రమాదకరం’’’ అని ధర్మాసనం పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వికి తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news