రూ.. 2000 నోట్లను ప్రజలు దాస్తున్నారు… రద్దు చేయమన్న ఆర్ధిక శాఖ నిపుణుడు…!

-

పెద్ద నోట్లు రద్దు చేసి నేటికి మూడేళ్లు. నవంబర్ 8, 2016 రాత్రి 8 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ నల్లధనం, నకిలీ కరెన్సీని అడ్డుకోవడమే లక్ష్యంగా రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ప్రజలు క్యూ కట్టారు. ఈ సందర్భంగా ఓ ఆర్ధిక నిపుణుడు ఆసక్తికర అభిప్రాయం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల స్థానంలో తెచ్చిన రూ.. 2000 నోటును కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్‌. సి. గార్గ్‌ అభిప్రాయపడ్డారు.

రూ.2000నోట్లను కూడా దాచి ఉంచుతున్నట్లు ఆధారాలున్నాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. చెలామణిలో ఉన్న నోట్ల విలువలో మూడో వంతు రూ.2000 నోట్లే ఉన్నాయ‌ని ఆయన తెలిపారు. కానీ వీటిలో చాలా వ‌ర‌కు చ‌లామ‌ణిలోకి రావ‌డం లేద‌న్నారు. రోజువారీ లావాదేవీలకు ప్రజలకు ఇవి అందుబాటులో ఉండడం లేద‌ని ఆయ‌న తెలిపారు.

ఈ క్ర‌మంలోనే వాటిని వెనక్కి తీసుకోవడం లేదా రద్దు చేయాల్సిన అవసరం ఉంద‌ని వ్యాఖ్యానించారు. అయితే దీనికి ప‌రిష్కారంగా రూ.2000నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ అయ్యేలా చర్యలు తీసుకుంటే సరిపోతుంద‌పి ఆయ‌న తెలిపారు. వాటి స్థానంలో న‌గ‌దును తిరిగి ఇవ్వొద్ద‌న్న ష‌ర‌త్తు పెట్ట‌డం ద్వారా చ‌లామ‌ణిలో ఉన్న రూ. 2000 నోట్ల‌న్ని వెనక్కి వస్తాయ‌ని ఎస్‌.సి.గార్గ్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version