నిర్భయ దోషి రివ్యూ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం..

-

నిర్భయ కేసు నిందితులకు ఉరిశిక్ష అమలు విసయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్షయ్‌కు ఉరిశిక్ష వేయడం సరికాదని అతని తరపు న్యాయవాది వాదనల్ని కోర్టు తప్పు పట్టింది. గతంలో కూడా ఇవే వాదనలు చేశారని న్యాయస్థానం పేర్కొంది. కేసులో రివ్యూ పిటీషన్ కి అవకాశమే లేదన్న సుప్రీం కోర్ట్, త్వరలో నలుగురు దోషులను ఉరి తీయాల్సిందే అని స్పష్టం చేసింది. ఇటీవల తనకు విధించిన ఉరి శిక్షను రద్దు చెయ్యాలని కోరుతూ అక్షయ్ ఠాకూర్ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నలుగురు నిందితులు తీహార్ జైల్లో ఉన్న నేపధ్యంలో వీరిని త్వరలోనే ఉరి తీయనున్నారు.

వాళ్ళు క్షమించరాని నేరం చేసారని కోర్ట్ పేర్కొంది. ట్రయల్ కోర్ట్ లో వాదనలు వినిపించేందుకు అవకాశం ఇచ్చామని ఇక రివ్యు పిటీషన్ కి అవకాశమే లేదని స్పష్టం చేసింది. కాగా, డిసెంబర్ 16, 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా… వారిలో ఒకడు… తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో… జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news