ఇన్ఫోసిస్ కో ఫౌండర్ క్రిస్ గోపాలకృష్ణన్‌పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు

-

ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్‌పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనపై తప్పుడు కేసులు పెట్టి ఉద్యోగంలో నుంచి తొలగించారని, అంతేకాకుండా కులపరమైన విమర్శలు, బెదిరింపులు చేశారని మాజీ ఐఐఎస్‌సీ ప్రొఫెసర్ దుర్గప్ప ఫిర్యాదు చేశారు.

గిరిజన తెగకు చెందిన దుర్గప్ప ఫిర్యాదుతో క్రిస్ గోపాలకృష్ణన్‌తో పాటు మరో 17 మందిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అసలు విషయానికొస్తే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో ప్రొఫెసర్ దుర్గప్ప విషయంలో హానీ ట్రాప్ అభియోగాలు ఉన్నాయని ఆయన్ను పదవి నుంచి తొలగించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో దుర్గప్ప తనపై కావాలని కుట్ర చేశారని, ఐఐఎస్పీ డైరెక్టర్ బలరాం సహా మరికొందరు కావాలని హానీట్రాప్ కేసులో ఇరికించారని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా దుర్గప్ప కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆదేశాల మేరకు 18 మందిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు 71 సివిల్ అండ్ సెషన్ కోర్టు ఆదేశాలివ్వడంతో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ సహా మిగతా వారిపై కేసులు నమోదయ్యాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version