మరో టీడీపీ కీలక నేతపై కేసు… ఎందుకు…?

-

బనగానపల్లె టిడిపి మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు. బిసి జనార్ధన్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేసిన పోలీసులు, డోన్ రూరల్ పోలీసు స్టేషన్ కు తరలించారు. బిసి జనార్ధన్ రెడ్డిపై ఐపిసి 307, 147, 148, 324, 341, 3 క్లాస్ 1, సెక్షన్ ల తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు. అయితే ఎందుకు అరెస్ట్ చేసారు ఏంటీ అనే దానిపై క్లారిటీ రావడం లేదు.

బనగానపల్లెలో బిసి జనార్ధన్ రెడ్డి ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులను బిసి జనార్ధన్ రెడ్డి అనుచరులు పట్టుకున్నారు. ఇరువురి మధ్య ఘర్షణ జరగగా… ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేసి మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డితో పాటు మరికొంత మంది ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసిన పోలీసులు… స్టేషన్ కి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version