16 నుంచి పాఠశాలలు రీ ఓపెన్ : మంత్రి ఆదిమూలపు

-

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థల రీ ఓపెన్ పై మరోసారి మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఈ  నెల 16వ తేదీ నుంచి స్కూళ్లను రీ-ఓపెన్ చేస్తున్నామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. రెగ్యులర్ టైమింగ్సులోనే స్కూళ్లను రన్ చేస్తామని…కోవిడ్ ప్రొటోకాల్ పాటించేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తైందన్నారు. వ్యాక్సిన్ వేయించుకోని మిగిలిన టీచర్లకు కూడా టీకాలు వేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించామని…ఆన్ లైన్ తరగతులు రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదని వివరించారు. ప్రైవేట్ పాఠాశాలల్లో ఆన్ లైన్ తరగతులు నడపొద్దని ఆదేశించామన్నారు.ఈ నెల 16వ తేదీ నుంచి ఆఫ్ లైన్లోనే పూర్తి స్థాయిలో పాఠశాలలను నిర్వహిస్తామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. పాఠశాలలో… కచ్చితంగా కరుణ నియమ నిబంధనలను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఆదిమూలపు. ముఖ్యంగా మాస్కులు మరియు శానిటైజర్ లు వాడటం తప్పనిసరి అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news