స్నేహమేరా జీవితం… నమ్మిన స్నేహితుడికి ప్రాణం అయినా ఇవ్వడం, ఆ స్నేహితుడి కోసం ఎంత వరకు అయినా తెగించడమే నిజమైన స్నేహం… కష్టాల్లో ఉంటే… ఆ స్నేహితుడి కోసం ఏదైనా చెయ్యాలి… అయితే చాలా మంది స్నేహితులు ఈ రోజుల్లో తమ స్నేహితులను కాపాడుకోవడానికి కనీసం ప్రయత్నం చేయడం లేదు. స్నేహంలో లాభం చూడటం మినహా కష్టం వస్తే నిలబడటానికి ముందుకి వచ్చే వారు కాదు. ఇక ప్రాణాపాయంలోనో ప్రమాధంలోనో ఉంటే సహాయం చేయడానికి మానవత్వంతో కనీసం ముందుకి రావడం లేదు…
ఇక కొంత మంది అయితే ఫోటోలు, వీడియోలు, సేల్ఫీలు తీస్తూ పోయే ప్రాణాన్ని వీళ్ళ గుర్తులతో సాగనంపుతూ ఉంటారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు దాదాపుగా ఈ విధంగానే వ్యవహరిస్తూ స్నేహం అంటేనే నమ్మకపోయెలా చేస్తుంది. తాజాగా ఒక చిన్నారి… తన స్నేహితురాలి కోసం ప్రాణాలకు తెగించి కష్టపడి బ్రతికించుకుంది. జింబాబ్వేలోని సిందెరేలా అనే గ్రామంలో రెబెకా ముంకోబ్వే అనే బాలిక తన స్నేహితులతో కలిసి చెరువు దగ్గరకు ఈతకు వెళ్ళగా… ఇంతలో ఉదుటున వచ్చిన ఒక మొసలి… తన స్నేహితురాలు మౌవానీని నోట కరుచుకుని నీటి లోపలి తీసుకువెళ్ళింది.
మౌవానీ భయంతో బిగ్గరగా అరవగా గమనించిన రేబెకా వచ్చి ఏ మాత్రం కంగారు పడకుండా తన స్నేహితురాలిని లాక్కుని వెళ్తున్న మొసలిని వెంటాడింది. ముసలిపై దూకి… తన చేతితో గట్టిగా ముసలి తలపై పిడిగుద్దులు కురిపించింది. అయినా మొసలి వెనక్కి తగ్గలేదు… దీనితో ఆ మొసలి కళ్ళు పీకేసింది… ఇక చేసేది లేక మొసలి రేబెకాను వదిలి నీళ్ళల్లోకి వెళ్లిపోయింది. వెంటనే తన స్నేహితురాల్ని వీపుకి కట్టుకుని ఒడ్డుకి చేర్చి ఆస్పత్రికి తీసుకు వెళ్ళింది. ప్రస్తుతం ఇద్దరికీ చిన్న గాయాలు అయినా సరే ఆరోగ్యం నిలకడగా ఉంది.