కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఊహించని పరిణామం ఎదురైంది. కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై గుర్తుతెలియని వ్యక్తుల దాడి జరిగింది. హోమ్ మంత్రి రేవంత్ పాలనలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకే రక్షణ కరువు అయిందని ట్రోలింగ్ చేస్తున్నారు.

తార్నాకలోని ఆర్టీసీ హాస్పటల్ సమీపంలో వాహనంపై దూసుకు వచ్చిన సుమారు 50 మంది దుండగులు… కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి ప్రయత్నించారు. అడ్డుకోబోయిన గన్మెన్ల చేతిలో నుంచి వెపన్స్ లాక్కోవడానికి ప్రయత్నించారు దుండగులు. అయితే దుండగుల బారి నుంచి తప్పించుకుని ఓయూ పోలీస్ స్టేషన్కు చేరుకొని కంప్లైంట్ ఇచ్చారు ఎమ్మెల్యే శ్రీ గణేష్.