ఇసుకకు ప్రత్యామ్నాయం కనిపెట్టిన శాస్త్రవేత్తలు.. ఇకపై ఇసుక అవసరం లేకుండా నిర్మాణాలు

-

ఒకప్పుడు ఇళ్లు కట్టాలంటే 4-5 లక్షలు ఉన్నా సరిపోయేది.. మంచి ఇళ్లు కట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు 5 లక్షలు ఒక పక్కకు కూడా సరిపోవడం లేదు. 25-30 లక్షలు అవుతున్నాయి. నిర్మాణ రంగంలో ఇసుకకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి.. ట్రాక్టర్‌ ఇసుక 4 నుంచి 6 వేలు వరకూ ఉంది. సహజ ఇసుకకు బదులుగా నిర్మాణాలకు ఉపయోగపడే మెటీరియల్‌ను భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్తలు నిర్మాణంలో సహజ ఇసుక స్థానంలో కొత్త మెటీరియల్‌ను రూపొందించారు. నిర్మాణ పరిశ్రమలో కీలకమైన పదార్ధమైన ఇసుక కొరత పెరుగుతున్న దృష్ట్యా ఈ ఆవిష్కరణ జరిగింది.
IISC యొక్క సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ (CST)లోని ఒక బృందం పారిశ్రామిక వ్యర్థ వాయువులలో సేకరించిన కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉపయోగించి కొత్త పదార్థాన్ని అభివృద్ధి చేసింది. తవ్విన మట్టి మరియు నిర్మాణ వ్యర్థాలను కార్బన్ డయాక్సైడ్తో శుద్ధి చేసి ఇసుకకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.

కొత్త మెటీరియల్ నిర్మాణ రంగం యొక్క పర్యావరణ ప్రభావాన్ని తగ్గిస్తుందని నిర్మాణ రంగ నాణ్యతను మెరుగుపరుస్తుందని పత్రికా ప్రకటన తెలిపింది. ఈ ఆవిష్కరణకు అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌరదీప్ గుప్తా నాయకత్వం వహిస్తున్నారు. దేశంలోని జీరో కార్బన్ లక్ష్యాలకు అనుగుణంగా తక్కువ కార్బన్ ప్రిఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ ఉత్పత్తులను తయారు చేసే సాంకేతికతను అభివృద్ధి చేశామని సౌరదీప్ గుప్తా వివరించారు. మట్టికి కార్బన్ డయాక్సైడ్ జోడించడం వల్ల సిమెంట్ మరియు సున్నంతో కలపడం మెరుగుపడుతుంది.
ఈ ఆవిష్కరణ విజయంవంతం అయితే.. ఎంతో మందికి మేలు జరుగుతుంది. ఇసుక, కంకర, సువ్వ వీటికే లక్షలు ఖర్చు అవుతాయి.. ఒక 2BHK ఇళ్లు నిర్మించాలంటే కనీసం 30 టన్నుల ఇసుక అవసరం ఉంటుంది. ఈ ఆవిష్కరణతో ఇసుకకు ప్రత్యామ్నాయం వస్తే ఖర్చు కాస్తైనా తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news