రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. 52 రైళ్లు రద్దు..

-

తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర ప్రాంతాలకు రైళ్లలో వెళ్లే ప్రయాణికులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఏపీ, తెలంగాణ పరిధిలో నడుస్తున్న పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రేపటి నుంచి రద్దు చేస్తోంది. వీటిలో కొన్ని వారం రోజుల పాటు రద్దు చేస్తుండగా.. మరికొన్ని పాక్షికంగా కొన్ని తేదీల్లో మాత్రమే రద్దు కానున్నాయి. విజయవాడలో రైల్వే నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ 70 రైళ్లను రద్దు చేయాల్సి వస్తోందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే పలు రైళ్లును రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.. తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే మొత్తం 52 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది దక్షిణ మధ్య రైల్వే .. వీటితో పాటు మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గుణదల – విజయవాడ సెక్షన్‌లో ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా.. రైళ్లు రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. రేపటి నుంచి అంఏ ఈ నెల 22వ తేదీ నుంచి ఈ నెల 29వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు చేసింది.. రద్దు చేయబడిన రైళ్లలో హైదరాబాద్‌- విశాఖపట్నం మార్గంలో ఉన్న జన్మభూమి, గరీబ్‌రథ్‌ వంటి రైళ్లు కూడా ఉన్నాయి.. రద్దు చేయబడిన రైళ్లకు సంబంధించిన వివరాలు కింద లిస్ట్‌లో గమనించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version