ఢిల్లీ : 9 మంది న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేశారు. ఈ నియామకాన్ని ప్రకటిస్తూ రాష్ట్రపతి కూడా నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. కొలీజియం సిఫార్సు ను అంగీకరిస్తూ నిన్న రాత్రి రాష్ట్రపతి ఆమోదానికి పంపింది కేంద్ర ప్రభుత్వం. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సులను యథాతధంగా ఆమోదించిన ప్రభుత్వం… తదుపరి, ప్రభుత్వం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు నియామకపు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ తొమ్మిది మందిలో ముగ్గురు మహిళ న్యాయమూర్తులు ఉన్నారు. ఇక ఇందులో కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న భవిష్యత్తులో భారత సర్వోన్నత న్యాయస్థానం తొలి మహిళ ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జస్టిస్ విక్రమ్ నాధ్ ( గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్ బి.వి. నాగరత్న ( కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి), తో పాటు, సీనియర్ అడ్వకేట్ పి.ఎస్. నరసింహ భారత ప్రధాన న్యాయమూర్తులు అయ్యే అవకాశం ఉన్నట్లు సంచారం.