చత్తీస్‌గడ్ హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్య అనుమతి లేకుండా ఆమెతో భర్త శృంగారం చేసినా అది అత్యాచారం కాదని, దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని, చట్ట ప్రకారం అది సమ్మతమేనని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఓ మహిళ తన భర్త, అతని కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఆ విధంగా తీర్పు చెప్పింది.
సదరు మహిళ తన భర్త తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, నిత్యం శారీరకంగా చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని, శృంగారం పేరిట శరీర భాగాలను చిత్రవధ చేస్తున్నాడని.. తనకు న్యాయం చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఇరు వర్గాల వాదనలను విన్న కోర్టు తీర్పు చెప్పింది.
భార్య అనుమతి లేకున్నా భర్త ఆమెతో శృంగారం చేస్తే దాన్ని రేప్‌గా పరిగణించలేమని, చట్ట ప్రకారం అది చెల్లుతుందని తెలిపింది. అయితే అలాగని చెప్ప భర్త తన భార్యను చిత్రహింసలు పెట్టడం, శారీరకంగా హింసించడం ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదని, అవి నేరం కిందకు వస్తాయని కనుక అలాంటి వ్యక్తులను చట్ట ప్రకారం శిక్షించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి అభిప్రాయ పడ్డారు.