ఆన్‌లైన్‌లో దైవదర్శనం కోసం సర్చ్‌ చేసి.. సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కిన టీచర్‌..

-

సైబర్‌ మోసాలు ఈరోజుల్లో ఏరూపంలో అయినా జరుగుతున్నాయి.. ఇలా కూడా దోచుకుంటారా అనే రీతిలో ఇవి నేరగాళ్లు చేస్తున్నారు. చాలామంది మన ఫోన్‌లో మన నెట్‌తో మనం గూగుల్‌లో సర్చ్‌చేసేవి ఎవరికి తెలియవు అనుకుంటారు కానీ మీపైనే డేగ కన్నువేసిన నేరగాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఆన్‌లైన్‌లో దైవదర్శనం కోసం టికెట్స్‌ బుక్‌ చేసుకుందాం అనుకున్న ఓ టీచర్‌ను బురిడీ కొట్టించి అందిన కాడికి దోచుకున్నారు..
కామారెడ్డి జిల్లా క‌ల్కి న‌గ‌ర్‌కు చెందిన ఉపాద్యాయురాలు విజ‌య ల‌క్ష్మి..కుటుంబంతో క‌లిసి కాశ్మీర్‌లోని వైష్ణావి దేవి ఆల‌యానికి దైవ ద‌ర్శ‌నం కోసం వెళ్లాలి అనుకుంది. వైష్ణవి దేవి ఆల‌యం వ‌ర‌కు న‌డవ‌డం సాద్యం కాదు అనుకుని దీంతో పైకి వెళ్లేందుకు హెలికాప్ట‌ర్ బుక్ చేసుకొవాల‌నుకుంది. అయితే హెలిక్యాప్ట‌ర్ బుకింగ్ కోసం ఆన్ లైన్‌లో సెర్చ్‌ చేసింది. ఆమెకు ఆన్‌లైన్‌లో సైబర్‌ నేరగాళ్లు టీచర్‌ని ట్రాప్ చేశారు. హెలికాప్టర్ బుకింగ్ నెంబ‌ర్ ఇచ్చారు. ఆ నంబ‌ర్‌ను సంప్ర‌దించింది. అయితే అవతలి వ్యక్తులు టికెట్ ధర చెప్పగానే వాళ్లు అడిగినంత చెల్లించింది అయినప్పటికి టికెట్ రాలేదు.
టికెట్ రాకపోవడంతో టీచర్ విజయలక్ష్మి మళ్లీ ఫోన్ చేసి అడిగితే ఇంకా డ‌బ్బులు కావాల‌ని డిమాండ్ చేశారు. దాంతో మోసపోయినట్లుగా టీచర్ విజయలక్ష్మి గ్రహించింది..అయితే అప్ప‌టికే సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు 18,240 రూపాయలు వసూలు చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ నేరగాళ్ల రూపంలో మోసపోయిన విజయలక్ష్మీ దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు… కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అమాయకులను ఎప్పుడు బురిడి కొట్టిద్దామా అనుకునే సైబర్‌ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. గూగుల్‌లో చూసి బ్యాంకు వాళ్లకు ఫోన్‌ చేయడం, సరైన వెరిఫికేషన్‌ లేకుండా.. ఆన్‌లైన్‌లో చూసి డబ్బులు చెల్లించడం అస్సలు మంచిది కాదు. చదువుకున్నవాళ్లే సైబర్‌ మోసాలకు గురవుతున్నారు. వీరిపట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే పదే చెప్తున్నా తెలిసీ తెలియక వారి ఉచ్చులో పడుతున్నారు. ఈ మధ్యనే మిస్డ్‌ కాల్‌తోనే రూ. 50లక్షలు కాజేశారు.. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news