“తమన్ నా శిష్యుడే.. జీరో స్థాయి నుంచి వచ్చాడు…” మణిశర్మ

-

మెలోడీ బ్రహ్మ మని శర్మ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా తన శిష్యులు తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు..

సంగీత దర్శకుడు మణిశర్మ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలీ అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ఆయన మీ శిష్యుల్లో ఎంతమంది సంగీత దర్శకులు అయ్యారు అనే ప్రశ్నకు.. ” నా శిష్యుల్లో చాలామంది సంగీత దర్శకులు అయ్యారు.. హేరిస్‌ జయరాజ్‌, దేవీశ్రీ ప్రసాద్‌, తమన్‌.. వీళ్లందరూ నా దగ్గర చేసినవాళ్లే. దేవీ శ్రీ ప్రసాద్‌ను సింగర్‌ చేసింది కూడా నేనే అనుకుంటా. అయితే వీళ్లందరిలో జీరో నుంచి వచ్చిన వ్యక్తి మాత్రం తమన్‌. తన సహనమే అతడిని ఇంతవాడిని చేసింది. నా దగ్గర ఉన్నప్పుడు పని ఒత్తిడిలో నేను ఏది ఉంటే అది విసిరేసేవాడిని. టీవీ వెనక్కి వెళ్లి దాక్కునేవాడు. ఇక శివమణి ఏది దొరికితే దానితో వాయించేస్తాడు. ఫ్లైట్‌ ఎక్కినప్పుడు చేతిలో స్టిక్స్‌ ఉంటే వాటితోనే అద్భుతం చేస్తాడు. ప్లైట్‌ ఎక్కినవాళ్లందరూ క్లాప్స్‌ కొట్టేవాళ్లు… “అని చెప్పుకొచ్చారు..

అలాగే “ఏఆర్ రెహమాన్ తో కూడా నాకు మంచి అనుబంధం ఉంది.. రెహమాన్‌ నన్ను ‘ఓయ్‌’ అని పిలుస్తారు. నాకు పాటలు పాడడం కూడా నేర్చుకోమని సలహా ఇచ్చారు. మేమిద్దరం కలిసి చాలా సినిమాలకు పనిచేశాం. ఇప్పటికీ అప్పుడప్పుడు ఫోన్లు చేసుకుంటూ ఉంటాం సమయం దొరికినప్పుడల్లా కలుస్తూ ఉంటాం ఆయన నాకంటే గొప్ప ప్లేయర్ ఇందులో ఎలాంటి అనుమానం లేదు అలాగే ఆయనకు ఆస్కార్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను ఆయన ఆస్కార్కు అర్హుడు కూడా..” అంటూ చెప్పుకొచ్చారు..

Read more RELATED
Recommended to you

Latest news