ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎటూ తేల్చుకోలేక పోతున్న ఎస్ఈసీ !

-

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ పై ఏపీ ఎన్నికల సంఘం తర్జన భర్జన పడుతోంది. ఎందుకంటే ఆగిన చోట నుంచే ప్రక్రియను కొనసాగిస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఎస్ఈసీని ప్రభుత్వం కోరింది. కానీ అలా చేస్తే ప్రతిపక్షాలు మూకుమ్మడి దాడి చేసే అవకాశం ఉండడంతో ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎస్ఈసీ సమాలోచనలు చేస్తోంది. తన ముందున్న వివిధ ప్రత్యామ్నాయాలపై ఎస్ఈసీ కసరత్తు చేస్తోంది. దీనికి ప్రస్తుతం మూడు అషన్లు పరిశీలిస్తోంది. ఆప్షన్‌-1: ఆగిన చోట నుంచే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడం, ఆప్షన్‌-2: కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయడం, ఆప్షన్‌-3: ఈ ఎన్నికల నిర్వహణను కొత్త ఎస్‌ఈసీకి వదిలేయడం.

ఇక మూడు ఆప్షన్లను పరిశీలిస్తోన్న ఎస్‌ఈసీ కొత్త నోటిఫికేషన్‌ ఇస్తే.. న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయనే భావనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఆగిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామని గతంలో ప్రకటించడంతో కొత్త నోటిఫికేషన్‌ జారీకి ఇబ్బందులు ఉండొచ్చనే భావన వ్యక్తం అవుతోంది. కొత్త నోటిఫికేషన్‌ ఇస్తే ఎస్‌ఈసీ గతంలో చేసిన ప్రకటనను చూపుతూ ప్రభుత్వం కోర్టుకెళ్లే ఛాన్స్‌ కనిపిస్తోంది. ఆగిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తే ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల విషయంలో కూడా పరిస్థితి గందరగోళంగా మారడంతో ఎన్నికల కమిషన్ పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version