తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల ప్రధాన రహదారిపై గుంజపడుగు గ్రామానికి చెందిన ప్రముఖ హై కోర్ట్ న్యాయవాది గట్టు వామన్ రావు పై కత్తులతో దాడి చేసి చంపారు దుండగులు. ప్రాణాపాయ స్థితిలో రక్తం మడుగులో రోడ్డు పై పడి ఉన్న వామన రావుని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. తనపై దాడి చేసింది గుంజపడుగు గ్రామనికి చెందిన మంథని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ అని న్యాయవాది చనిపోక ముందు చెప్పినట్టు సమాచారం.
అడ్డు వచ్చిన భార్య నాగమణికి కూడా తీవ్ర గాయాలు కాగా ఇద్దరూ ఆసుపత్రికి తీసుకు వెళ్ళాక మరణించారు. శీలం రంగయ్య లాకప్ డెత్ కేస్కు సంబంధించి వామన రావు పిల్ వేసినట్టు చెబుతున్నారు. అది కాకుండా గతంలో పుట్ట మధు అక్రమ ఆస్తులు సంపాదించాడని కూడా పిల్ వేశారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు వెతిరేకంగా పలు కేసులు వాదిస్తున్న వామన రావు కుంట శ్రీనివాస్ ఎటాక్ చేశాడని చెప్పడం సంచలనంగా మారింది.