ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం సార్వత్రిక ఎన్నికలు 2024 మార్చి లో జరగనున్నాయి. అందుకోసం ఇప్పటికే ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అందుకు తగిన ఏర్పాట్లలో ఉంది. కాగా ఈనెల 20వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలతో మీటింగ్ ను నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ లో ఎన్నికల గురించి కొన్ని కీలక విషయాలను వారితో ముఖేష్ కుమార్ మీనా చర్చించనున్నారు. ఈ మీటింగ్ అనంతరం ఎలక్షన్ సంఘం నుండి అధికారులు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అదనపు ఓట్లు ఉన్నాయా అన్న విషయాన్ని తేల్చడానికి ఈ ప్రక్రియను సీరియస్ గా తీసుకుని చేయనున్నారు.
ఇటీవల ఎంపీ మిథున్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు గల్లంతయ్యాయి అన్న విషయంపై విచారణ చేయనున్నారు.