కరోనా ఎఫెక్ట్ తో భారత్ లో రెండో మరణం…

-

కరోనా వైరస్ ప్రభావం దేశంలో రోజురోజుకీ పెరుగుతోంది. రీసెంట్ గా కర్ణాటకలోని కలబుర్గికి చెందిన 76 ఏళ్ల వ్యక్తి కరోనా సోకి చనిపోయాడు. భారత్ లో నమోదైన మొదటి కరోనా మరణం ఇదే… అయితే ఇప్పుడు కరోనా వైరస్ ఎఫెక్ట్ తో మరో మహిళ మరణించింది. ఢిల్లీకి చెందిన 69 ఏళ్ళ వృద్దురాలు కరోనా ప్రభావంతో మరణించినట్టు డాక్టర్లు నిర్దారించారు. మృతురాలి కుమారుడు కూడా కరోనా ప్రభావంతో ఇప్పుడు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అయితే ఆమె కుమారుడు గత నెలలలో యూరప్ లో పర్యటించాడు. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత తల్లికొడుకులిద్దరికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరారు. అయితే మృతురాలికి డయాబెటిస్ ఉండటంతో ఆమె ఆరోగ్యం మరింతగా దిగజారింది. దీంతో రాత్రి ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు నిర్దారించారు.

దీంతో భారత్ లో కరోన వైరస్ మృతుల సంఖ్య రెండుకి చేరింది. ఇప్పటికే ఇండియాలో కరోనా భాదితుల సంఖ్య 81 కి చేరింది. వారిలో 16 మంది విదేశీయులు. మహారాష్ట్రలోెనే అత్యధికంగా 14 మందికి కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ లో మరో 10 మందికి కరోనా వైరస్ సోకింది. అయితే కరోనా వైరస్ ప్రభావంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్ తో స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version