ఏపీలో రెండో డోస్ ఎంత మందికి ఇవ్వాలి…?

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కాస్త అదుపులోకి వచ్చాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింగాల్ అన్నారు. కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతున్నాయని అన్నారు. తుఫాన్ ప్రభావం కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆక్సిజన్ పై కేంద్ర ప్రభుత్వ సూచన‌మేరకు సమీక్షించాం అని ఆయన చెప్పారు. ఏపీకి రోజువారీ 590 టన్నుల ఆక్సిజన్ను కేంద్రం కేటాయించింది అని తెలిపారు.

తుఫాన్ కారణంగా ఒకట్రొండు రోజులు ఆలస్యమైనా ఇబ్బంది లేకుండా ఉంచేందుకు అదనంగా ఆక్సిజన్ ట్యాంకులు రప్పించాం అని అన్నారు. ఫీవర్ సర్వే లో నమోదైన టెస్ట్ శాంపిల్స్ అన్నింటినీ ల్యాబ్ కి పంపించాం అని వెల్లడించారు. కోవిడ్ కారణంగా తల్లి దండ్రులని కోల్పోయిన చిన్నారుల వివరాలని జిల్లాల వారీగా సేకరిస్తున్నాం అని తెలిపారు. జిల్లాల వారీగా బ్లాక్ ఫంగస్ కేసులు సేకరిస్తున్నాం అని బ్లాక్ ఫంగస్ కేసులకి సంబంధించి అవసరమైన మందులని‌ జిల్లాలకి సరఫరా చేస్తున్నాం అని పేర్కొన్నారు. 1,18,000 మందికి పైగా కోవాక్సిన్ రెండవ డోసు ఈ నెలాఖరుకి ఇవ్వాలి అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news