ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలు

-

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పంచాయతీ ఎన్నికలను అధికార వైసిపి అలాగే ఇతర ప్రతిపక్ష పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. ఒక రకంగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయా అనే అనుమానం వచ్చేంతగా ఈ ఎన్నికల విషయంలో పార్టీలు పోరాడుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఇంకా ఎన్నికల మాత్రమే జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే నేటి నుంచి రెండో విడత ఎన్నికల ప్రక్రియ మొదలైంది.

రాష్ట్ర వ్యాప్తంగా 18 రెవెన్యూ డివిజన్లు 174 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 3335 సర్పంచ్ స్థానాలు, 33632 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి నేటి నుంచి నామినేషన్ లు స్వీకరించనున్నారు. నామినేషన్ ల దాఖలుకు ఈ నెల 4వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. అలాగే 5న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 8న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఇక 13వ తేదీన పోలింగ్ జరిగి అదే రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news