ఆదిపురుష్ కూడా మొదలయిపోయింది

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా అయిన రాధేశ్యాం అనే సినిమా రిలీజ్ చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన దాదాపుగా మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు. అందులో ఇప్పటికే సలార్ సినిమా షూటింగ్ మొదలైంది కూడా. ఇప్పుడు మరో సినిమా షూటింగ్ కూడా మొదలైందని అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు అయిపోయిందని ప్రచారం జరుగుతూ వస్తోంది. కానీ ఈ రోజున మొదలు అవుతున్నట్లుగా ప్రభాస్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టులు పెట్టాడు. ఆది పురుష్ ఆరంభ్ అంటూ ఆయన తన సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సీత పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనే దాని మీద సరైన క్లారిటీ లేదు.

#Adipurush aarambh.

#SaifAliKhan Om Raut #BhushanKumar #PrasadSutar #RajeshNair T-Series Films Retrophiles Pvt. Ltd. T-Series #TSeries

Posted by Prabhas on Monday, 1 February 2021

Read more RELATED
Recommended to you

Latest news