తెలంగాణ చీఫ్ సెక్రెటరీ శాంతికుమారిపై సెక్రెటేరియట్ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన ఉద్యోగుల బదిలీ విషయంలో ఆమె సమన్యాయం పాటించలేదని, ఆమె వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆమెకు సన్నిహితులైన ఉద్యోగులకు ఓ రూల్, ఇతర ఉద్యోగులకు మరో రూల్ అమలు చేస్తున్నట్టు పెద్దఎత్తున ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.ఈ మధ్యకాలంలో జరిగిన బదిలీల్లో ఏళ్ల కొద్దీ ఒకేచోట పనిచేస్తున్న వారిని గుర్తించి బదిలీ చేశారు. కానీ, అందులో సీఎస్‌కు సన్నిహితంగా ఉండే వారికి కోరిన చోట పోస్టింగ్ ఇచ్చారని, మిగతా వారిని ఎక్కడికో బదిలీ చేశారని విమర్శలు వస్తున్నాయి.ఈ విషయంపై ఉద్యోగులు సీఎంఓకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.