స్టేజ్‌ ఎక్కగానే కాళ్లు, చేతులు వణుకుతున్నాయా? అయితే నీ అవకాశం ఎదుటివారికి పోయినట్లే!

-

ప్రతి ఒక్కరికీ కొన్ని ఆలోచనలు, ఇష్టాలు ఉంటాయి. డ్యాన్స్‌ చేయాలి. పాటలు పాడాలి. వాటిలోపై స్పీచ్‌ ఇవ్వాలని కలలు కంటుంటారు. ఆ కలను నెవవేర్చుకునే పనిలో అందరి ముందు స్టేజిపైకి ఎక్కుతారు. ధైర్యంగా మైక్‌ తీసుకొని గొంతు సవరించుకుంటారు. తీరా నోట్లోంచి మాటలు వచ్చేసరికి కాళ్లు, చేతులు వణకడం మొదలవుతుంది. చుట్టూ నిశ్వబ్దం. అందరూ నన్నే చూస్తున్నారనే ఆలోచనలతో నోట్లోంచి మాట బయటకు రాదు. వచ్చిన మాటకూడ తడబడుతూ వస్తుంది. ఆ వణుకుతూ వచ్చే మాటలే తోటి ఉద్యోగులు కావొచ్చు, అధికారులు కావొచ్చు ఎవరికైనా ధైర్యాన్నిస్తుంది. ఎదుటివారికి ధైర్యం ఇవ్వడం మంచిదే కదా అనుకుంటే పొరపాటే. ఇక్కడ నువ్వు ఎదుటివారిని తొక్కేయాలి గాని వారికి అవకాశం కల్పించకూడదు. ఇప్పుడు అర్థమైంది కదా. నువ్వు తడబడుతూ మాట్లాడితే ఇతరులకు ధైర్యం వచ్చి వారు గట్టిగా, స్పష్టంగా మాట్లాడుతారు. దాంతో వారికే ఉద్యోగం వరించే అవకాశం ఉంటుంది. ఈ విషయం నువ్వు ఎక్కడా మర్చిపోకూడదు సుమా! మరి భయపడకుండా మాట్లాడి అంటే ఎలా అని ఇతురులను అడగాల్సిన అవసరం లేదు. మీరే తెలుసుకోవచ్చు. మీకు మీరే గైడ్‌గా వ్యవహరించాలి. అయితే.. ఇందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకో…

 

భయాన్ని అధిగమించేలా..
– ఏ రోజు అయితే ప్రసంగం, మీటింగ్‌ ఉంటుందో దానికి కొన్ని రోజుల ముందే ఇంట్లో పెద్ద అద్దం పెట్టుకోవాలి. దానికి ముందు బాగా ప్రసంగాలు ఇచ్చిన వారి వీడియోలు చూడాలి. వారి హావభావాలు, వే ఆఫ్‌ టాకింగ్‌, ైస్టెల్‌ అన్నీ గమనించాలి.
– తర్వాత నువ్వు ఏది మాట్లాడాలనుకున్నావో ముందుగానే రాసుకో. దానికి కంఠస్తం చేయకుండా అర్థం చేసుకోండి. ఎలా మాట్లాడుకోవాలో ముందుగానే ప్రిపేర్‌ అవ్వండి. అన్నీ పనులు అయ్యాక అద్దం ముందు నిల్చుని మిమ్మిల్ని మీరే చూసుకుంటూ మాట్లాడుకోండి. చెప్పాలనుకున్న విషయం చెప్పండి.
– పేపర్‌ చూడకుండా మాట్లాడండి. మీరు మాట్లాడిన విషయాన్ని రికార్డ్‌ చేసుకోండి. పూర్తి స్పీచ్‌ అయ్యాక మీరు మాట్లాడింది మరలా మీరే వినండి. ఎక్కడెక్కడ ఆగిపోయారు, ఎలాంటి పదాలుకు తడబడ్డారో గమనించండి. ఆడియో రికార్డింగ్‌ కన్నా వీడియో రికార్డింగ్‌ బెటర్‌. అప్పుడే మీ హావభావాలు తెలుస్తాయి.
– ఇకపోతే స్టేజిపై మైక్‌ ఒకటే కాకుండా చిన్న పోడియం కూడా ఉండేలా చేసుకోండి. ఎందుకంటే అది మీకు ధైర్యాన్నిస్తుంది. చేతులు, కాళ్ళను కప్పి ఉంచుతుంది. దీంతోపాటు పోడియంను పట్టుకున్నప్పుడు ఒక్కరే అన్న ఫీలింగ్‌ పోతుంది.
– ఎదురుగా ప్రజల్ని చూడగానే భయం వేస్తుంది. అందుకే వారిని కాకుండా వారి తలలపై చూడాలి. లేదంటే అక్కడ తెలిసిన వారుంటే వారిని చూస్తూ మాట్లాడినా సరిపోతుంది. మీరు మాట్లాడే మాటలు సోదిలా అనిపించకూడదు. ఎదుటివారికి ఇన్పిరేషన్‌గా అనిపించాలి. మాటల్లో విషయం ఉండాలి.
– చెప్పాలనుకున్న దానిని స్పష్టంగా, అర్థవంతంగా చెపపగలగాలి. విషయాన్ని సాగదీయకూడదు. సూటిగా సుత్తిలేకుండా చెప్పాలి.
– రోబోలా ఒకేచోట ఉండకుండా స్టేజిని ఉపయోగించుకోవాలి. రెండు చేతులు కట్టుకోకుండా వాటిని కదిలిస్తూ మాట్లాడాలి. ఎదుటివారు మీ మాటల్ని ఇంట్రెస్టింగ్‌గా వింటున్నారా లేదా గమనించాలి. వారిని ఉత్తేజపరిచేందుకు మధ్యలో హాస్యాన్నిచ్చే జోకులు చెప్పిన పర్వాలేదు. లేదంటే మీ స్పీచ్‌లో వారిని కూడా భాగస్వాములు చేయాలి. అప్పుడే మీరు స్పీచ్‌లో సక్సెస్‌ సాధించినట్టు.

Read more RELATED
Recommended to you

Latest news